Nani's Jersey movie : నాని జెర్సీ మూవీకి అరుదైన గౌరవం!

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు గాను యంగ్ హీరో నాని నటించిన జెర్సీ చిత్రం ఎంపికైంది.

Krishna
Published on: 31 July 2020 9:34 PM IST
Nanis Jersey movie : నాని జెర్సీ మూవీకి అరుదైన గౌరవం!
X
Nani jersey movie poster

Nani's Jersey movie : భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు గాను యంగ్ హీరో నాని నటించిన జెర్సీ చిత్రం ఎంపికైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంట‌గా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంది.

అయితే ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శనకు నోచుకోవటం పెద్ద విషయమే అని చెప్పాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. త‌మ చిత్రానికి ఇంత గౌర‌వం ద‌క్కడంపై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ ఫిలిం ఫెస్టివల్‌లో నాని 'జెర్సీ'తో పాటు కార్తీ నటించిన 'ఖైదీ', సూపర్ 30 సినిమాలు కూడా ఎంపికయ్యాయి.

ఇక జెర్సీ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం సినిమాలో కీలక పాత్రగా నిలిచింది. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం దర్శకత్వం ఈ చిత్రానికి మరో ఆకర్షణ గా నిలిచింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. అక్కడ కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ నాని పాత్రలో షాహిద్ క‌పూర్ క‌నిపించ‌నున్నాడు. తన పాత్ర కోసం కోచ్ స‌మ‌క్షంలో ప‌లు షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Krishna

Krishna

Next Story