Nani: పుట్టినరోజు నాడు అభిమానుల కోసం నాని స్పెషల్‌ పోస్ట్‌

* పుట్టినరోజు నాడు ఎమోషనల్ అయిన న్యాచురల్ స్టార్

Dhatripriya
Published on: 25 Feb 2023 10:37 AM IST
Nanis Emotional Post On His Birthday
X

పుట్టినరోజు సందర్భంగా నాని పెట్టిన ఎమోషనల్ పోస్ట్

Nani: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తలనైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న్యాచురల్ స్టార్ నాని నిన్న తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కలిపి 39 చోట్ల నాని కోసం పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.

అభిమానులతో పాటు చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా నానికి శుభాకాంక్షలు తెలిపారు. నాని తన అభిమానుల కోసం కృతజ్ఞతలు చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు. నాని చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారుతోంది. "1984 ఫిబ్రవరి 24న శుక్రవారం నాడు నేను రిలీజ్ అయ్యాను. గత 15 ఏళ్లుగా ఎన్నో శుక్రవారాలు నేను మళ్లీ మళ్లీ పుడుతూ వచ్చాను. ఈ శుక్రవారం మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా మీతో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను," అని ఎమోషనల్ అయ్యారు నాని. నాని మెస్సేజ్ ను అభిమానులు కూడా సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

ఇక సినిమాలోపరంగా చూస్తే ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని తాజాగా ఇప్పుడు "దసరా" సినిమాతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెలా అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చ్ 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.


Dhatripriya

Dhatripriya

Next Story