Dasara: ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ చేసిన నాని సినిమా..

Nani’s Dasara Theatrical Business at Record Price
x

Dasara: ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ చేసిన నాని సినిమా..

Highlights

Dasara: న్యాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా".

Dasara: న్యాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". తెలంగాణ గోదావరిఖని లోని బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న పీరియడ్ డ్రామాగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నాని ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి ఒక విభిన్న రా మరియు రస్టిక్ లుక్ తో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు చిత్ర బృందం కూడా సినిమా హైప్ ని పెంచడానికి రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీలు వాడుతోంది. వారి కష్టానికి ఫలితంగానే ఈ సినిమా థియట్రికల్ బిజినెస్ అద్భుతంగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని దసరా సినిమా థియేటర్ రైట్లు రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు సమాచారం.

సినిమాకి సంబంధించిన సీడెడ్ రైట్స్ ను చిత్ర బృందం 6.5 కోట్లకు అమ్మగా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ రేషియో 13 నుంచి 14 కోట్ల మధ్యలో జరిగింది. ఓవర్ ఆల్ గా కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే "దసరా" సినిమా థియట్రికల్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడయ్యాయి. మరోవైపు ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు తెలంగాణలో ఈ సినిమాని సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కేవలం నైజాం ఏరియా లోనే ఈ సినిమా రైట్స్ విలువ 14 కోట్లు ఉందని సమాచారం.

ఇక ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 43 కోట్లకు చేరింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ చేరాలంటే 43 కోట్లను బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేయాలి. నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియట్రికల్ బిజినెస్ కూడా నాని కెరియర్ లోనే రికార్డు స్థాయిలో జరిగింది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చ్ 30న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories