Nani: సరికొత్త లుక్తో ఆకర్షించిన నాచురల్ స్టార్

Nanis  Dasara Movie to portray him in Negative Role | Tollywood News Today
x

 సరికొత్త లుక్తో ఆకర్షించిన నాచురల్ స్టార్

Highlights

Nani : నెగిటివ్ షేడ్ పాత్రలో నాని

Nani: ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" తో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని హీరోగా నటిస్తున్న సినిమాలలో "దసరా" కూడా ఒకటి. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నట్లు సమాచారం. "శ్యామ్ సింగరాయి" సినిమాలో క్లీన్ షేవ్ లుక్తో కనిపించిన నాని ఈ సినిమాలో తన పాత్ర కోసం గడ్డం పెంచనున్నారట. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "నేను లోకల్" తర్వాత నాని కీర్తి సురేష్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహబ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ తోనే సాగనుందని సమాచారం. భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని ఒక సరికొత్త లుక్తో ఆకట్టుకోబోతున్నారట. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories