Dasara Movie: భారీ స్థాయిలో జరిగిన నాని "దసరా" థియేట్రికల్ బిజినెస్

Dasara Movie: ఏరియా వైజ్ గా నాని "దసరా" థియేట్రికల్ బిజినెస్

Dhatripriya
Updated on: 27 March 2023 9:30 PM IST
Nanis Dasara Movie Theatrical Business On Grand Scale
X

Dasara Movie: భారీ స్థాయిలో జరిగిన నాని "దసరా" థియేట్రికల్ బిజినెస్

Dasara Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా "దసరా" సినిమా త్వరలో విడుదల కి సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. భారీ అంచనాల మధ్య ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో మార్చ్ 30 న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ మధ్యనే విడుదలైన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది కానీ మిగతా భాషల్లో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్ర తెలుగు వర్షన్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇప్పటిదాకా నాని కెరియర్ లోనే అత్యంత ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా "దసరా" రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు గనక సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఏరియా వైస్ గా దసరా సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం.

నైజాం: 14 కోట్లు

సీడెడ్: 6.5 కోట్లు

యూ ఏ: 3.9 కోట్లు

ఈస్ట్: 2.3 కోట్లు

వెస్ట్: 2 కోట్లు

గుంటూరు : 3 కోట్లు

కృష్ణ: 2 కోట్లు

నెల్లూరు: 1.3 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ : 35 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 3 కోట్లు

ఓవర్సీస్: 6 కోట్లు

వరల్డ్ వైడ్: 44 కోట్లు

Dhatripriya

Dhatripriya

Next Story