Nani: ఫ్లాప్ సినిమా డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇవ్వనున్న నాని

Nani: ఫ్లాప్ సినిమా డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇవ్వనున్న నాని

Rama Rao
Updated on: 12 Jun 2022 4:30 PM IST
Nani Will Give Another Chance to Director Merlapaka Gandhi | Tollywood News
X

ఫ్లాప్ సినిమా డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇవ్వనున్న నాని

Nani: "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన "ఎక్స్ ప్రెస్ రాజా" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. ఇలా వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలను అందించడంతో మేర్లపాక గాంధీకి వరుసగా బోలెడు అవకాశాలు వచ్చిపడ్డాయి. కానీ నాని హీరోగా నటించిన "కృష్ణార్జున యుద్ధం" సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకోలేకపోయింది. ఆ తరువాత "ఏక్ మినీ కథ", "మేస్ట్రో" వంటి సినిమాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు మేర్లపాక.

అయితే తాజాగా మళ్లీ నాని హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. "కృష్ణార్జున యుద్ధం" సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మళ్లీ మేర్లపాక గాంధీ తో సినిమా చేయడానికి నాని ఒప్పుకోవటం విశేషం. సినిమా కలెక్షన్ల గురించి పక్కన పెడితే మేర్లపాక పై నానికి మంచి నమ్మకం ఉండటం, పైగా ఈసారి మేర్లపాక గాంధీ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే నాని తో సినిమా మొదలయ్యే కంటే ముందే మేర్లపాక గాంధీ సంతోష్ శోభన్ హీరోగా మరొక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా కూడా హిట్ అయితే నాని మేర్లపాక సినిమాపై కూడా బజ్ పెరిగే అవకాశం లేకపోలేదు.

Rama Rao

Rama Rao

Next Story