Nani: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్లీ ఈ సినిమా చేయనున్న నాని

Nani: ఫ్లాప్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న నాని

Jyothi
Updated on: 26 Feb 2023 9:00 PM IST
Nani will Do this Film Again with the Director Gave it a Flop
X

Nani: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్లీ ఈ సినిమా చేయనున్న నాని

Nani: తన మార్కెట్తో ఏమాత్రం సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కరియర్లో ముందుకు దూసుకు వెళుతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ మధ్యనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని తాజాగా ఇప్పుడు దసరా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాని ఇంతకుముందు ఎన్నడు కనిపించినటువంటి రస్టిక్ లుక్కుతో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఒకవైపు హీరోగా మాత్రమే కాక మరోవైపు నిర్మాతగా కూడా నాని మంచి విజయాలు అందుకున్నాడు. "హిట్" సిరీస్ తో సూపర్ హిట్ లు అందుకున్న నాని "హిట్ 3" లో హీరోగా కూడా నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాని మరొక డైరెక్టర్ తో చేతులు కలపడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు వివేక్ ఆత్రేయ. "బ్రోచేవారేవరురా" వంటి మంచి హిట్ సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ గతంలో నాని హీరోగా "అంటే సుందరానికి" సినిమాకి దర్శకత్వం వహించారు.

ఎంత భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అలాంటిది మళ్లీ ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో చేతులు కలపడానికి నాని ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ చెప్పిన బేసిక్ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో నాని ఈ సినిమాకి ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట.

Jyothi

Jyothi

Next Story