తనకి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తోనే సినిమా చేయనున్న నాని..

Nani: నాని నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా..

Jyothi
Updated on: 10 Feb 2023 9:31 PM IST
Nani will do the Film with the Director Who Gave Him a Flop
X

తనకి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తోనే సినిమా చేయనున్న నాని

Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్లతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత నాని ఇంతకుముందు ఆల్రెడీ పనిచేసే ఒక డైరెక్టర్ తో మరొకసారి ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు. గతంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని "అంటే సుందరానికి" సినిమాలో హీరోగా నటించారు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నాని ఇప్పుడు మళ్లీ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి స్టోరీ నేరేషన్ మరియు స్క్రీన్ ప్లే విషయంలో వివేక్ ఆత్రేయ ఈసారి బాగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారని సమాచారం.

గతంలో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, వంటి సినిమాలతో మంచి మార్కులు వేయించుకున్న వివేక్ ఆత్రేయ "అంటే సుందరానికి" సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటారని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు. మరి నానితో తన నెక్స్ట్ సినిమాతో నైనా వివేక్ ఆత్రేయ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Jyothi

Jyothi

Next Story