వెంకటేష్ మహా డైరెక్షన్ లో సినిమా చేయనున్న నాని

Nani Will be Making a Film With Director of Venkatesh Maha | Tollywood News
x

వెంకటేష్ మహా డైరెక్షన్ లో సినిమా చేయనున్న నాని

Highlights

వెంకటేష్ మహా డైరెక్షన్ లో సినిమా చేయనున్న నాని

Nani-Venkatesh Maha Movie: ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "బ్రోచేవారెవరురా" ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నజ్రియా నజిం హీరోయిన్ గా నటించింది. ఈమధ్యనే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక మరోవైపు నాని "దసరా" సినిమాతో బిజీగా ఉన్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నాని ఇప్పుడు మరొక డైరెక్టర్ కి ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. "కేరాఫ్ కంచరపాలెం", "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" వంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ మధ్యనే నాని కి ఒక కథ వినిపించగా దానికి కూడా ఆ సినిమా కథ బాగా నచ్చిందట.

దీంతో నాని కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను మొగిలినేనీ ధీరజ్ నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 30వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దసరా సినిమా విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories