Nani: "దసరా" షూటింగ్ సమయంలో నాని గంటసేపు దానికే కేటాయించేవాడట

Nani: "దసరా" కోసం నాలుగు లేయర్ల మేకప్ వేసుకున్న నాని

Dhatripriya
Updated on: 9 March 2023 8:31 PM IST
Nani Wear Four Layers Make Up For Dasara Movie
X

Nani: "దసరా" షూటింగ్ సమయంలో నాని గంటసేపు దానికే కేటాయించేవాడట

Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి ఒక రస్టిక్ పాత్రలో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు.

సినిమా కోసం సినిమాలోని తన పాత్ర కోసం నాని కొంచెం డార్క్ గా కనిపించాల్సి వచ్చింది. దానికి తగ్గట్టుగానే నానికి రోజూ నాలుగు లేయర్ల మేకప్ వేసే వాళ్ళని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో నాని తన పాత్ర కోసం గంట సేపు కేటాయించి నాలుగు లేయర్ల మేకప్ వేయించుకోవాల్సి వచ్చేదట. ఆ తరువాత మళ్లీ మేకప్ ని తీసేయడానికి మరొక గంట పాటు కడగాల్సి వచ్చేదట. అంతేకాకుండా ఈ సినిమా కోసం బాగా మట్టి ఉన్న ప్రదేశాలు మరియు గడ్డకట్టే చలిలో షూటింగ్ చేశారు నాని. మరి నాని కష్టం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story