Nani: చిట్టి హైట్‌ను మ్యాచ్ చేసేందుకు నాని తిప్పలు ...

Nani: హైట్ కనపడాలని నాని పడ్డ తిప్పలు

Rama Rao
Published on: 30 Oct 2022 8:29 PM IST
Nani was Troubled By Faria Abdullah | Tollywood News
X

Nani: చిట్టి హైట్‌ను మ్యాచ్ చేసేందుకు నాని తిప్పలు ...

Nani: ఎలాంటి జోనర్ సినిమా అయినా హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పండాలంటే వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండాలి. ముందుగా హీరో హీరోయిన్ ఒకరికొకరు బాగా సూట్ అయ్యారు అనిపించాలి. ముఖ్యంగా హైట్ విషయంలో హీరోయిన్ ఎక్కువ హైట్ ఉంటే ఆమెకు తగ్గ హీరోలు దొరకటం కొంచెం కష్టం అవుతుంది. ఈ మధ్యనే "జాతి రత్నాలు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఫరియా అబ్దుల్లా విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఈ అందమైన భామ ఆరు అడుగులు ఉంటుంది. దీంతో ఈమెకు తగ్గ జోడిని ఎంపిక చేయడం దర్శక నిర్మాతలకు పెద్ద టాస్క్ చెప్పాలి. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న "లైక్ షేర్ సబ్స్క్రైబ్" అనే సినిమాలో నటిస్తోంది ఫరియా. తాజాగా ఈ సినిమా వేడుకకు నాచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ సమయంలో స్టేజ్ మీద ఫరియా పక్కన నిలబడ్డ నాని హైట్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డారేమో అని అనిపిస్తోంది.

ఫోటోలు దిగుతున్న సమయంలో నాని కావాలని అరికాళ్ళను పైకెత్తి తన కన్నా హైట్ ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నించారు. ఆ వేడుకలో మాట్లాడుతూ కూడా నాని తను ఫరియా కంటే హైట్ తక్కువ అని చెప్పుకొచ్చాడు. ఇదంతా నాని కావాలని సరదాగా చేసినా కూడా ఎక్కడో ఒకచోట నాని హైట్ కనపడాలని ప్రయత్నం చేసినట్టే అనిపిస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story