థియేటర్స్ లో విడుదలైన నాని వి చిత్రం

థియేటర్స్ లో విడుదలైన నాని వి చిత్రం
x
Highlights

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం 'వి'. ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో...

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం 'వి'. ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. గత ఏడాది ఈ సినిమా భారీ అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాస్తి చెందడంతో థియేటర్స్ తెరుచుకోవడం కష్టతరం కావడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే థియేటర్స్ గత ఏడాది డిసెంబర్ నుంచి తెరచుకోవడంతో కొన్ని సినిమాలు ఆ దిశగా ఆడుగులు వేశాయి.

సాయి తేజ్ నటించిన సోలో బ్రతుకే సోబెటర్ మూవీ సినీ అభిమానులను థియేటర్స్ బాట పట్టించింది. ఆ సినిమా ఇచ్చిన స్పూర్తితో మరి కొన్ని మూవీస్ థీయేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. అందులో భాగంగా నాని వి చిత్రం కూడా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్టైలిష్ కిల్లర్‌గా నాని .. డీసీపీ ఆదిత్యగా సుధీర్ బాబు నటించారు. నివేదా, అదితి రావు హైదరీ హీరోయిన్లు కాగా..అమిత్ త్రివేది బాణీలు సమకూర్చారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల కోసం థియేటర్స్ లో విడుదల చేశారు. కాగా.. ఈ సినిమాలో మొదటి భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు థ్రిల్ కలిగిస్తాయి ఓటీటీ కంటే థియేటర్ ఎక్స్ పీరియన్ప్ బాగుంటుందని సినీ అభిమానులు అభిప్రాయ పడిన విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories