స్టోరీ రైటర్ గా మారనున్న న్యాచురల్ స్టార్

స్టోరీ రైటర్ గా మారనున్న న్యాచురల్ స్టార్
x
Highlights

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ లను అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఎట్టకేలకు 'జెర్సీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. గౌతమ్...

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ లను అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఎట్టకేలకు 'జెర్సీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా లో నాని క్రికెటర్ పాత్రలో కనిపించాడు. శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 19 న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసుకుంటోంది. ఇక ఈ సినిమా తరువాత నాని 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అని టైటిల్ రిలీజ్ వీడియో చూస్తే తెలుస్తోంది.

విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో నాని ఒక స్టోరీ రైటర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. నాని కెరీర్లో 24 వ చిత్రంగా ఈ సినిమా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల కానుంది. 'దేవదాస్' లో డాక్టర్ గా, 'జెర్సీ' లో క్రికెటర్ గా మెప్పించిన నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా లో స్టోరీ రైటర్ గా కనిపించనున్నాడు అన్నమాట. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర వివరాల గురించి త్వరలో తెలియనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories