Nani: సుందర్ చాలా వరస్ట్ ఫెలో..

Nani: ఈ మధ్యనే "శ్యామ్ సింగారాయి" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "అంటే సుందరానికి" సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2022 2:42 PM IST
Nani Reveals About His Character In Ante Sundaraniki Movie
X

Nani: సుందర్ చాలా వరస్ట్ ఫెలో..

Nani: ఈ మధ్యనే "శ్యామ్ సింగారాయి" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "అంటే సుందరానికి" సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "బ్రోచేవారెవరురా" ఫేమ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నజ్రియా నజీం హీరోయిన్గా నటిస్తోంది. టీజర్ మరియు ట్రైలర్ తోనే బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

నాని మరియు నజ్రీయా ఇప్పటికే సినిమా ప్రమోషన్ లు అంటూ చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి మరియు తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు నాని. "అమాయకపు పాత్రలో నటించడం చాలా ఈజీ కానీ సుందర్ అమాయకత్వం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నా పాత్ర గురించి నెరేట్ చేస్తున్న సమయంలో వివేక్ ఆత్రేయ సుందర్ పెద్ద వరస్ట్ ఫెలో సార్ కానీ ప్రతి ఫ్రేమ్ లోనూ మనం అతనిని ప్రేమిస్తాం" అని అన్నారు" అని చెప్పిన నాని సుందర్ తన పాత్ర ను ఒక ఇన్నోసెంట్ కన్నింగ్ ఫెలో అని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story