Nani: పక్కింటి అబ్బాయి ఇమేజ్ గురించి రియాక్ట్ అయిన నాని..

Nani: "ఆ ఇమేజ్ ను దాటి కూడా గతంలో సినిమాలు చేశాను" అంటున్న నాని

Jyothi
Updated on: 16 March 2023 9:30 PM IST
Nani Reacted About the image of the Pakkinti Abbayi
X

Nani: పక్కింటి అబ్బాయి ఇమేజ్ గురించి రియాక్ట్ అయిన నాని

Nani: నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "దసరా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పటిదాకా చాలా వరకు సినిమాలలో పక్కింటి అబ్బాయి లాంటి తరహా పాత్రలతోనే నాని మంచి క్రేజ్ ను అందుకున్నాడు.

కానీ తాజాగా ఇప్పుడు దసరా సినిమాతో ఒక విభిన్న లుక్కుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి ఒక రస్టిక్ లుక్ తో నాని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దసరా ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ పై రియాక్ట్ అయ్యారు. తనను పక్కింటి అబ్బాయి తరహా పాత్రలలో చూసి మెచ్చుకున్న ప్రేక్షకులు దసరా వంటి సినిమాలో చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకున్నారు అని అడగగా గతంలో కూడా నాని తన ఇమేజ్ను పక్కనపెట్టి "పిల్ల జమిందార్", "శ్యామ్ సింగ రాయి" వంటి సినిమాలు చేశానని జెర్సీలో కూడా తన పాత్ర పక్కింటబ్బాయి లాగా ఉండదని కాబట్టి దసరా సినిమా విషయంలో కూడా భయపడలేదని అన్నారు.

అంతేకాకుండా తాను ఎప్పుడు జోనర్ ను బట్టి సినిమాని సెలెక్ట్ చేసుకోనని కేవలం స్క్రిప్ట్ నచ్చితేనే ముందుకెళ్తానని అన్న నాని కథ తనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అన్నారు. ఇక పక్కింటి అబ్బాయి అని పిలిచిన లేదా మరెలా పిలిచినా కూడా అది ప్రేక్షకుల అభిమానం మాత్రమే తప్ప ఇంకేమీ కాదని అన్నారు.

Jyothi

Jyothi

Next Story