"సీతారామం" సినిమాకి నో చెప్పిన టాలీవుడ్ హీరోలు

"సీతారామం" సినిమాకి నో చెప్పిన టాలీవుడ్ హీరోలు

Arun Chilukuri
Updated on: 17 Aug 2022 8:45 PM IST
Nani Ram and Vijay Missed Sitaramam
X

దుల్కర్ సల్మాన్ కంటే ముందు "సీతారామం" కథ విన్న ముగ్గురు హీరోలు

SitaRamam Movie: దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "సీతారామం". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సీతామహాలక్ష్మి పాత్ర కోసం మృణాల్ కంటే ముందు పూజ హెగ్డే ని సంప్రదించిన సంగతి తెలిసిందే. అలానే రామ్ పాత్ర కోసం కూడా హను రాఘవపూడి వేరే హీరోలని అనుకున్నారట.

ముందుగా ఈ కథ యువ హీరో విజయ్ దేవరకొండ కి వినిపించారు. కానీ విజయ్ దేవరకొండ కథకి అంతగా కనెక్ట్ అవ్వకపోవడంతో సినిమాకి నో చెప్పారట. ఆ తరువాత నానికి కథ వినిపించినప్పటికీ "పడి పడి లేచే మనసు" సినిమా డిజాస్టర్ అవ్వడంతో నాని కూడా ఈ సినిమాకి నో చెప్పారు. ఆ తరువాత హను రామ్ పోతినేని కి కూడా ఈ కథను వినిపించారు. కానీ అసలు సినిమాలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్లు లేకపోయేసరికి రామ్ కూడా సినిమాకి నో అన్నారట.

ఆ తరువాత ఈ స్క్రిప్ట్ దుల్కర్ సల్మాన్ చేతుల్లోకి వెళ్ళింది. కథ బాగా నచ్చిన దుల్కర్ వెంటనే సినిమాకి ఓకే చెప్పేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాని వదులుకున్నందుకు విజయ్ దేవరకొండ తనకి ఎలాంటి రిగ్రెట్ లేదని చెప్పారు కానీ రామ్ మరియు నాని మాత్రం ఇలాంటి హిట్ సినిమాను వదులుకున్నందుకు డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story