Thalapathy Vijay-Nani: విజయ్ కోసం విలన్ గా మారనున్న టాలీవుడ్ హీరో

Nani Playing Villain Role in Thalapathy Vijay New Movie
x

విజయ్ తలపతి - నాని(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమం అక్టోబర్ 15న జరగబోతోంది *ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా రాబోతున్న మహేష్ బాబు

Thalapathy Vijay - Nani: "మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సినిమా పూర్తయిన తర్వాత విజయ్ "మహర్షి" డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #తలపతి66 అని అభిమానులు ఈ చిత్రాన్ని ముద్దుగా పిలుస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నటీనటులు గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం ఒక టాలీవుడ్ హీరో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని. ఇప్పటికే "వీ" సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించిన నాని ఇప్పుడు ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

కీయారా అద్వానీ లేదా రష్మిక మందన్న లలో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూజా అక్టోబర్ 15న జరగబోతోంది.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మహేష్ బాబు రాబోతున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 27 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories