Nani: నెక్స్ట్ సినిమా గురించి అధికారికంగా ప్రకటించిన నాని

Nani: న్యూ ఇయర్ సందర్భంగా నెక్స్ట్ సినిమా గురించి చెప్పనున్న నాని

Dhatripriya
Updated on: 31 Dec 2022 10:01 AM IST
Nani Officially Announced About The Next Movie
X

Nani: నెక్స్ట్ సినిమా గురించి అధికారికంగా ప్రకటించిన నాని

Nani: ఈ మధ్యనే "శ్యామ్ సింగారాయ్", "అంటే సుందరానికి" వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "దసరా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నాని ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి ఒక పక్కా మాస్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే నాని తన 30వ సినిమా గురించిన అధికారిక ప్రకటన ను విడుదల చేశారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మరియు కె ఎస్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో కూడా నాని ఒక సరికొత్త విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. పొడుగు జుట్టుతో ఫోన్ చెక్ చేసుకుంటూ నాని ఈ చిత్ర పోస్టర్లో కనిపించారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సాయంత్రం 4:05 కి సినిమాకి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

అదే రోజు సినిమా డైరెక్టర్ తో పాటు సినిమా గురించిన మరిన్ని వివరాలను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. విభిన్న పాత్రలతో నాని ఈమధ్య ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు హీరోగా మాత్రమే కాకుండా మరోవైపు నిర్మాతగా కూడా నాని ఈమధ్య వరుస సూపర్ హిట్లను అందుకుంటున్నారు. ఈ మధ్యనే అడివి శేష్ హీరోగా నటించిన "హిట్ 2" సినిమాని నిర్మించిన నాని ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story