త్వరలో లాంచ్ ఇవ్వనున్న నాని సినిమా

Ruthvik
Published on: 24 April 2019 10:17 PM IST
త్వరలో లాంచ్ ఇవ్వనున్న నాని సినిమా
X

వరుసగా రెండు డిజాస్టర్ లను చవిచూసిన న్యాచురల్ స్టార్ నాని ఎట్టకేలకు 'జెర్సీ' సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని చేతిలో ప్రస్తుతం మరికొన్ని సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నాని తన తొలి సినిమా 'అష్టాచమ్మా' కు దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈనెల 26వ తేదీన లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో నాని మరియు సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాని నెగిటివ్ పాత్రలో కనిపించనున్నాడు అని వార్తలు బయటకు వస్తున్నాయి కానీ వాటిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాల గురించిన ప్రకటన త్వరలో వెలువడనుంది.

Ruthvik

Ruthvik

Next Story