Shyam Singh Roy: బిజినెస్‌లో దుమ్మురేపుతోన్న నాని 'శ్యామ్ సింగరాయ్'

Shyam Singha Roy Movie: నాచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరు.

Venkata Chari
Updated on: 26 April 2021 5:00 PM IST
Nanis ‍New Movie Shyam Singh Roy Trending in Trade
X

'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో నాని (ఫొటో ట్విట్టర్)

నాచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. స్టార్ హీరోలతో సమానంగా నాని చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద పేరు లభిస్తుంది. నాని చిత్రాల కోసం ఎదురుచూసే ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి చిత్రంతో నాని మార్కెట్ కూడా నెమ్మదిగా పెరుగుతోంది. తాజా సమాచారం మేరకు, నాని చిత్రాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది.

నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా బిజినెస్ లో పెద్ద సంచలనం క్రియోట్ చేయనుందంట. థియేటర్ హక్కుల కోసం భారీ అమోంట్ తో పంపిణీదారులు సిద్ధంగా ఉన్నారని తాజా నివేదికలు ధృవీకరిస్తున్నాయి. అదే సమయంలో, నాన్-థియేట్రికల్ హక్కుల విలువ సుమారు 30 కోట్లుగా ఉందని తెలుస్తోంది.

30 కోట్లతో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం... అలాగే 40 కోట్లకు థియేటర్స్ బిజినెస్ కావడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారంట. ముందుగా నిర్మాతలు 60-70 కోట్ల మధ్య వ్యాపారం జరగాలని అనుకున్నారంట. ప్రస్తుతం ఈ బిజినెస్ తో 'శ్యామ్ సింగ రాయ్' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Shyam Singh Roy

రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అలాగే నానితో సాయి పల్లవి, కృతి శెట్టి రొమాన్స్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాకు మిక్కీ మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story