Shyam Singha Roy Title Song: ఎగసిపడే అలజడిలా వచ్చేసిన 'శ్యామ్ సింగ రాయ్'

Shyam Singha Roy Title Song: 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం నుండి మొదటి సింగిల్ విడుదల

Sandeep Reddy
Updated on: 6 Nov 2021 11:23 AM IST
Nani New Movie Shyam Singha Roy Title Song Released Today 06 11 2021 | Shyam Singha Roy Songs
X

Shyam Singha Roy Title Song: ఎగసిపడే అలజడిలా వచ్చేసిన 'శ్యామ్ సింగ రాయ్'

Shyam Singha Roy Title Song: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఇటీవలే సాంగ్ ప్రోమోని విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ''శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే" అంటూ చిత్రంలో నాని పాత్రని వర్ణిస్తూ సాగిన ఈ మొదటి సింగిల్ సంగీత ప్రియులను ఆకట్టుకోనుంది.

ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించగా విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఈ పాటని పాడారు. 1970 లో కలకత్తా నేపథ్యంలో నడిచే ఈ కథలో నాని సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నాలు హీరోయిన్స్‌గా నటించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story