Nani: నాని ఆ విషయంలో తగ్గాల్సిందేనా?

Nani: నాని ఆ విషయంలో తగ్గాల్సిందేనా?

Rama Rao
Published on: 21 Jun 2022 3:10 PM IST
Nani is Demanding a Remuneration of Up to Rs 15 Crore for a Film
X

నాని ఆ విషయంలో తగ్గాల్సిందేనా?

Nani: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మీడియం రేంజ్ హీరో గా మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాని ఒక సినిమా కోసం 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత మూడేళ్లలో నాని కి ఒక మంచి హిట్ సినిమా కూడా లేదు. కానీ తమ సినిమాల నాన్ థియేట్రికల్ రెవెన్యూ మాత్రం బాగుంటుంది కాబట్టి నాని కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లేదు అంటూ కొనసాగుతున్నారు.

కానీ నాని థియేటరికల్ మార్కెట్ మాత్రం సినిమా సినిమాకి పడిపోతూ వస్తోంది.ఈమధ్యనే నాని హీరోగా నటించిన "అంటే సుందరానికి" సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదలైంది. రెండో వారాంతం పూర్తయ్యేసరికి ఈ చిత్ర కలెక్షన్లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పది రోజుల్లో 12 కోట్ల దాకా వసూలు చేసింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే ఉన్నాయి.

కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఈ సినిమా నమోదు చేసుకున్న కలెక్షన్లు నాని తీసుకునే రెమ్యూనరేషన్ కంటే చాలా తక్కువే. ఈ నేపథ్యంలో తన థియేట్రికల్ మార్కెట్ గురించి కూడా ఆలోచించి నాని తన రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story