Dasara 1st Day Collections: వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నాని దసరా కలెక్షన్లు..

Nani Dasara Movie Day 1 Worldwide Collections
x

Dasara 1st Day Collections: వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నాని దసరా కలెక్షన్లు..

Highlights

Dasara 1st Day Collections: వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నాని దసరా కలెక్షన్లు..

Dasara Collections: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "దసరా" సినిమా భారీ అంచనాల మధ్య నిన్న అనగా మార్చ్ 30న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా తమిళ్, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. తెలంగాణలోని గోదావరిఖని లో బొగ్గు గని బ్యాక్ డ్రాప్లో సాగే ఈ సినిమా కి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు లభించాయి.

మొదటి రోజు నుంచి ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుతుంది. ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. మొదటి రోజున అమెరికాలోని ప్రీమియర్లతో ఆరు లక్షల 30 వేల డాలర్లను ఈ సినిమా నమోదు చేసుకుంది. చిత్ర బృందం సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంతో మొదటి రోజు కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజున 19.38 కోట్లను వసూలు చేసింది.

ఏరియా వైస్ గా దసరా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి చూద్దాం:

నైజాం: 6.75 కోట్లు

సీడెడ్:1.47 కోట్లు

ఉత్తర ఆంధ్ర 1.48 కోట్లు

గుంటూరు: 1.21 కోట్లు

ఈస్ట్ గోదావరి: 0.87 కోట్లు

వెస్ట్ గోదావరి: 0.54 కోట్లు

కృష్ణ: 0.62 కోట్లు

నెల్లూరు: 0.34 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ: 13.28 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.5 కోట్లు

ఓవర్సీస్: 4.6 కోట్లు

వరల్డ్ వైడ్: 19.38 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories