Nani: "నా స్టార్ డం నన్ను అలాంటి సినిమాలు చేయకుండా ఆపకూడదు"..

Nani: స్క్రిప్ట్ సెలక్షన్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసిన నాని

Dhatripriya
Published on: 18 March 2023 3:28 PM IST
Nani Comments On Script Selection
X

Nani: "నా స్టార్ డం నన్ను అలాంటి సినిమాలు చేయకుండా ఆపకూడదు" అంటున్న నాని 

Nani: ఎప్పటికప్పుడు తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే హీరోలలో ఒకరు నాచురల్ స్టార్ నాని. జెంటిల్మాన్, వి వంటి సినిమాలలో నెగిటివ్ పాత్రలు సైతం చేయడానికి వెనుకాడకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తూ కరియర్లో ముందుకు దూసుకుపోతుంటాడు నాని. ఇప్పటిదాకా ఎన్నో ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసిన నాని తాజాగా ఇప్పుడు "దసరా" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించనటువంటి ఒక రస్టిక్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో నాని బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తను ఎలాంటి సినిమాలు చేయాలి అనేది తన స్టార్ డం డిసైడ్ చేయకూడదని అంటున్నాడు నాని.

"ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కూడా మన స్టార్డం డిసైడ్ చేసేంత పెద్ద స్టార్ అవ్వాలని నాకు లేదు. బాక్సాఫీస్ ప్రెషర్ వల్ల నేను విభిన్న కథలను ఎంచుకోకుండా ఆగిపోకూడదు. దేశం మొత్తం నా సినిమా చూడడానికి ఎదురుచూస్తుంది అని నేను ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే నేను ప్రెషర్ ఫీల్ అయితే నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేను చెప్పాలి అనుకున్న కథలు ప్రేక్షకుల ముందుకి తీసుకురాలేను," అని అన్నారు నాని. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న "దసరా" సినిమా ఈనెల 30వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story