Nani - Web Series: వెండితెర అంటేనే ఇష్టం అంటున్న న్యాచురల్ స్టార్

admin1
Published on: 4 Sept 2021 2:32 PM IST
Nani Comments About Acting on Web Series or Web Film
X

నాని (ఫైల్ ఫోటో)

Nani Talks About Web Series: ఈ మధ్యనే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "వీ" చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదలై డిజాస్టర్ గా మారింది. తాజాగా "టక్ జగదీష్" కూడా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కాబోతుంది. నాని మాత్రమే కాక నాని వాళ్ళ అక్క అయినా దీప్తి గంట కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. "మీట్ క్యూట్" అనే ఒక సినిమాని నిర్మిస్తున్న దీప్తి ఆ సినిమాను కూడా ఓటీటీ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం నాని కూడా త్వరలో సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పచ్చు అంటున్నారు కొందరు.

మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నాని స్వయంగా మాట్లాడుతూ, "నేను వెండితెర కు చాలా పెద్ద ఫ్యాన్ ని. అలాంటిది వెబ్ సినిమా చేయడానికి సరిపోతానా లేదా అని నాకు తెలీదు. సినిమాలలో బిగినింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ నాకు చాలా ఇష్టం. థియేటర్లలో సినిమా చూసే ఎక్స్పీరియన్స్ అంటే ప్రేమ," అంటూ నాని చెప్పుకొచ్చారు. తాజాగా "టక్ జగదీష్" సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయబోతుండడంతో అభిమానులు చాలా నిరాశ చెందిన సంగతి తెలిసిందే. ఇక నాని నటిస్తున్న "శ్యామ్ సింగా రాయ్", "అంటే సుందరానికి" సినిమాలు మాత్రం థియేటర్లలోనే విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story