నాని వ్యాఖ్యలకు కోపం తెచ్చుకున్న కన్నడ అభిమానులు

నాని వ్యాఖ్యలకు కోపం తెచ్చుకున్న కన్నడ అభిమానులు
x

నాని వ్యాఖ్యలకు కోపం తెచ్చుకున్న కన్నడ అభిమానులు

Highlights

* నాని వ్యాఖ్యలకు కోపం తెచ్చుకున్న కన్నడ అభిమానులు

Nani: ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "అంటే సుందరానికి" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "బ్రోచేవారెవరురా" ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం బ్యూటీ నజ్రియా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ అభిమానుల మనోభావాలను దెబ్బ తీశాయి.

చాలామంది కన్నడ వాళ్లకి తెలుగు కూడా వచ్చు అని అందుకే తమ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేయకుండా తెలుగులోనే విడుదల చేస్తున్నట్లు గా నాని చెప్పారు. ఈ నేపథ్యంలో చాలామంది కన్నడ అభిమానులు తమకు తెలుగు రాదని నాని సినిమాను కన్నడ లోనే చూడాలని అనుకుంటున్నట్లుగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో నాని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

"తమ సినిమాని డైరెక్ట్ గా తెలుగులో విడుదల చేసి డబ్బింగ్ లేకపోయినప్పటికీ తన కన్నడ కుటుంబ సభ్యుల లాంటి అభిమానులు సినిమాను ఇష్టపడుతున్నారని ఆ విషయంలో తాను కృతజ్ఞతలు చెప్పుకున్నాను, కానీ సోషల్ మీడియా నేను చెప్పిన ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దానివల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే నన్ను క్షమించండి" అని అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories