#NTR30: సినిమా ఆలస్యం పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్

#NTR30 Film: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 7:30 PM IST
Nandamuri Kalyan Ram Gives Clarity About #NTR30 Film
X

#NTR30: సినిమా ఆలస్యం పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్

#NTR30 Film: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పెట్టాలెక్కకపోవడంతో సినిమా గురించి బోలెడు పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో కొరటాల శివ ఈ ప్రాజెక్టు ను పక్కన పెట్టారని కూడా ఒకానొక దశలో పుకార్లు వినిపించాయి. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

"వెబ్ లో జరుగుతున్న చర్చల పై నాకు అవగాహన ఉంది. మూవీ ఆలస్యం అవుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారని కూడా నాకు తెలుసు. కానీ ఆర్ ఆర్ ఆర్ ఘనవిజయం తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్ కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాబట్టి అంచనాలు చేరుకునేలాగా గ్రాండ్ గా సినిమా చేయాల్సి ఉంటుంది. అందుకే కొంచెం సమయం పడుతుంది," అని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story