logo
సినిమా

Nandamuri Balakrishna: కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Tests Positive For Coronavirus
X

Nandamuri Balakrishna: కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ

Highlights

Nandamuri Balakrishna: సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు.

Nandamuri Balakrishna: సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు. అస్వ‌స్థ‌త‌కు గురైన బాల‌కృష్ణ ఇవాళ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. గత రెండు రోజులుగా తనని కలిసిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలు పంచుకుంటున్నారు.

Web TitleNandamuri Balakrishna Tests Positive For Coronavirus
Next Story