Nandamuri Balakrishna: సీఎం రేవంత్ రెడ్డికి నా కృత‌జ్ఞ‌త‌లు: నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 May 2025 3:54 PM IST
Nandamuri Balakrishna
X

Nandamuri Balakrishna: సీఎం రేవంత్ రెడ్డికి నా కృత‌జ్ఞ‌త‌లు: నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: ఎన్టీఆర్ శ‌తజ‌యంతి ఉత్స‌వాలు పూర్తిచేసుకున్న అద్భుత‌మైన ఘ‌డియ‌లు ఒక వైపు..

ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు..

నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ తో సత్కరించిన ఇలాంటి త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి "ఎన్టీఆర్ జాతీయ అవార్డు"ని నాకు ప్ర‌క‌టించ‌డం నా అదృష్టంగా, దైవ నిర్ణ‌యంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను.

ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను.

ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల దీవెన‌లు, నాన్న గారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్ల‌వేళలా ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story