NBK 107 Movie Teaser: బాల‌య్య‌ వేట ప్రారంభం కానుంది

Nandamuri Balakrishna NBK 107 Movie With Director Gopichand Malineni and Released Teaser
x

NBK 107 Movie Poster: (Image Source - Twitter)

Highlights

NBK 107 Movie Teaser: నేడు నందమూరి నటసింహాం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రో వీడియోతో ఎన్.బి.కె 107 ని అధికారికంగా ప్రకటించారు

NBK 107: నేడు నందమూరి నటసింహాం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇంట్రో వీడియోతో ఎన్.బి.కె 107 ని అధికారికంగా ప్రకటించారు. బాల‌య్య‌- గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ NBK 107 హంట్ త్వరలో ప్రారంభం కానుంది. క్రాక్ తో భారీ బ్లాక్ బస్టర్ ను అందించిన గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీ వర్గాల్లో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైత్రి బ్యానర్ లో నవీన్ యెర్నేని- వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కానుంది. క్రాక్ తో భారీ బ్లాక్ బస్టర్ ను అందించిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ కోసం శక్తివంతమైన స్క్రిప్ట్ ను రాశారు. క్రాక్ తరహాలోనే ఈ కథను కూడా గోపీ నిజసంఘటనల ఆధారంగా సిద్ధం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు భారీ బడ్జెట్ ని కేటాయిస్తోంది.

బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టే ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని రివీల్ చేశారు. సింహం నడిచేప్పుడు అందులో బాలకృష్ణ ముఖాన్ని చూడవచ్చు. ఈ చిత్రంలో బాలకృష్ణ శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారని చెప్పేందుకే అలా సింబాలిక్ గా ప్రదర్శించారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. NBK107 హంట్ స్టార్ట్స్.. షూటింగ్ త్వరలో ప్రారంభం కాగానే ఇతర వివరాల్ని మేకర్స్ వెల్లడిస్తారు. ఇతర తారాగణం సిబ్బంది వివరాలు చెబుతారు.


Show Full Article
Print Article
Next Story
More Stories