దసరాకు అభిమానులకు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్

దసరాకు అభిమానులకు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్
x
Highlights

దసరా రోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన కీలక పాత్రల్లో నటించి.. స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం...

దసరా రోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన కీలక పాత్రల్లో నటించి.. స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం నర్తనశాల. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన షూటింగ్‌ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. విజయదశమి కానుకగా ఎన్బీకే థియేటర్‌లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంతభాగం స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ట్విట్టర్ వేదికగా బాలకృష్ణ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories