Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

Nandamuri Balakrishna Clarifes About his Comments on Nurses In Unstoppable Show
x

Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

Highlights

Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

Nandamuri Balakrishna: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్" సెలబ్రిటీ టాక్ షో కి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్లో మాట్లాడుతూ గతంలో తనకు జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి చెప్పారు బాలయ్య. ఆక్సిడెంట్ గురించి వివరిస్తూ "ఆ నర్సు.. దానమ్మ భలే అందంగా ఉందిలే" అంటూ కామెంట్లు చేశారు. ఈ ఆ మాటలపై నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

నర్సులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రేగిన దుమారంపై బాలకృష్ణ తాజాగా స్పందించారు. తాను నర్సులను కించపరిచారనంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తన మాటల్ని కావాలనే వక్రీకరించారంటూ ఫేస్‌బుక్ మాధ్యమంగా వివరణ ఇచ్చారు. ''నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు సేవలు అందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను'' అంటూ బాలకృష్ణ వివరించారు.
Show Full Article
Print Article
Next Story
More Stories