Balakrishna Assistant: పేకాట ఆడుతూ దొరికిపోయిన బాలకృష్ణ అసిస్టెంట్

Balakrishna Assistant: ఇంతకుముందు బాలకృష్ణ వద్ద పనిచేసిన శేఖర్ కూడా వివాదాల్లో ఇరుక్కున్నారు...

admin1
Published on: 23 March 2022 11:22 AM IST
Nandamuri Balakrishna Assistant Balaji Arrested in Poker Case | Live News
X

Balakrishna Assistant: పేకాట ఆడుతూ దొరికిపోయిన బాలకృష్ణ అసిస్టెంట్

Balakrishna Assistant: టాలీవుడ్ సీనియర్ హీరో మరియు హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాలాజీని కర్ణాటక టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పేకాట రాయుల్ల పని పట్టాలని కంకణం కట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో నగరగేర్ ప్రాంతం ప్రాంతంలో నిఘా పెట్టి 19 మంది ను పేకాట ఆడుతుండగా పట్టుకుని అరెస్టు చేశారు.

అందులో బాలకృష్ణ అసిస్టెంట్ బాలాజీ కూడా ఒకరు. ఇక షాకింగ్ విషయం ఏమిటంటే హిందూపురం మండలం వైసీపీ కన్వీనర్ శ్రీ రామ్ రెడ్డి కూడా ఇక వాళ్ళలో కొంతమంది గవర్నమెంట్ టీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హిందూపురం కాన్స్టిట్యూఎన్సీ లో ఇప్పుడు వైసీపీ లీడర్ శ్రీ రామ్ రెడ్డి ని అరెస్ట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు టీడీపీ లీడర్లు బాలాజీ పై నిప్పులు చెరుగుతున్నారు. బాలకృష్ణ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి అవమానాలు బాలకృష్ణ కు మొదటి సారి కాదు. ఇంతకుముందు బాలకృష్ణ వద్ద పనిచేసిన శేఖర్ కూడా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన వల్ల ఇబ్బందులు పడ్డ బాలకృష్ణ అతనిని తీసేసి శేఖర్ స్థానంలో బాలాజీ ని ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు కూడా బాలకృష్ణ కు తలవంపులు వస్తున్నాయి. మరి ఈ విషయంలో బాలకృష్ణ ఏం చేస్తారో చూడాలి.

admin1

admin1

Next Story