BB3: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉగాది రోజు స్పెషల్ గిఫ్ట్ రెడీ

BB3: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూడో చిత్రం BB3.

Samba Siva Rao
Published on: 10 April 2021 3:56 PM IST
Bala Krishna BB3 Moive update
X
బీబీ3 మూవీ ఫైల్ ఫోటో

BB3: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూడో చిత్రం BB3. ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే సినిమాను మే 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించిన ఇంకా టైటిల్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ కొనసాగుతుంది. ఈ టైటిల్ త్వరలోనే ప్రకటింస్తారని సమాచారం.

ఈ సినిమాకు మొదట 'మోనార్క్' అనే టైటిల్ ప్రచారంలోకి రాగా, ఆ తర్వాత 'గాడ్ ఫాదర్', అలాగే 'టార్చ్ బేరర్' అనే పేర్లు బయటకు వచ్చాయి దీంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే ఉగాది రోజున ఆ టైటిల్ వెల్లడించి నందమూరి అభిమానులను ఫూల్ ఖూషి చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ రోర్, ఫస్ట్ లుక్ పోస్టర్ల సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు కలగలుపుతూ ఈ సినిమా రూపొందిస్తున్నారు బోయపాటి. ఎన్టీఆర్ జయంతి అయిన బోయపాటి.. ఉగాది రోజు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story