Akhanda OTT Release Date: ఓటీటీలలో "అఖండ" కి వ్యూస్ వస్తాయా?

Nandamuri Balakrishna Akhanda Movie will Soon be Released on the HotStar OTT Platform | Akhanda Movie OTT Release Date
x

హాట్ స్టార్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్న "అఖండ"(ఫైల్ ఫోటో)

Highlights

Akhanda Movie: హాట్ స్టార్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్న "అఖండ"

Akhanda Movie OTT Release Date: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా స్ట్రీమ్ కాబోతోంది. జనవరి రెండవ వారంలో ఈ సినిమా ఓటీటీలలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి "అఖండ" సినిమా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా. ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలని అభిమానులు థియేటర్లలో చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు.

కానీ ఓటీటీలలో విడుదలయ్యాక కూడా ఈ సినిమాకి మంచి వ్యూస్ లభిస్తాయని కొందరు చెబుతున్నారు. సినిమాలోని కనీసం కొన్ని సన్నివేశాలనైనా సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని అనుకుంటారని ఇక సినిమా అసలు చూడని వాళ్ళు కచ్చితంగా సినిమా చూస్తారని ఆ విధంగా ఈ సినిమాకి హాట్స్టార్ లో మంచివి వ్యూయర్షిప్ లభించబోతున్నట్లు అనిపిస్తోంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించగా నితిన్ మెహతా, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories