Namrata shirodkar: ఎప్పుడూ మిస్ అవ్వం.. కృష్ణపై ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..

Namrata shirodkar: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో మిగతా హీరోలతో పోలిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మంచి ఫ్యామిలీ పర్సన్.

Arun Chilukuri
Updated on: 8 March 2022 6:54 PM IST
Namrata Shirodkar Shares Pic of Krishna
X

Namrata shirodkar:ఎప్పుడూ మిస్ అవ్వం.. కృష్ణపై ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..

Namrata shirodkar: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో మిగతా హీరోలతో పోలిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మంచి ఫ్యామిలీ పర్సన్. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ కొంచెం విరామం దొరికినా సరే ఆ సమయాన్ని తన కుటుంబంతో మాత్రమే గడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు మహేష్. తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్లడానికి తన సినిమా షూటింగ్ లను మహేష్ బాబు వాయిదా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ గుణం తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి నేర్చుకున్నానని మహేష్ బాబు తరచుగా చెబుతూ ఉంటారు. కృష్ణ ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫామిలీ తో పాటు టిఫిన్ చేసేవారట షూటింగ్ నుంచి తిరిగివచ్చాక రాత్రి పిల్లలతో మాట్లాడాకే పడుకునే వారట.

ఇప్పుడు అదే సిద్ధాంతాన్నీ మహేష్ బాబు కూడా తన పిల్లల విషయంలో పాటిస్తున్నారు. తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ సితార లకు మహేష్ బాబు తన పూర్తి కాళీ సమయాన్ని కేటాయిస్తారు. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె కృష్ణ మరియు గౌతమ్ సీతార లు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ కృష్ణ గురించి చెప్పుకొచ్చింది. "మండే లంచ్.. మేము ఎప్పుడూ మిస్ అవ్వము.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు," అంటూ రాసుకొచ్చింది నమ్రత. ఇక మహేష్ బాబు సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు మహేష్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story