Nagarjuna: క్యాన్సిల్ అయిన నాగార్జున నెక్స్ట్ సినిమా

Nagarjunas Next Movie Was Canceled
x

Nagarjuna: క్యాన్సిల్ అయిన నాగార్జున నెక్స్ట్ సినిమా 

Highlights

Nagarjuna: అటకెక్కిన నాగార్జున తదుపరి చిత్రం

Nagarjuna: గత కొంతకాలంగా టాలీవుడ్ కి నాగార్జున సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. ఈ మధ్యనే నాగర్జున హీరోగా నటించిన ది గోస్ట్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది. ఒక వైపు నాగార్జున ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తుండగా మరోవైపు అభిమానులు నాగార్జున అని ఎప్పుడెప్పుడు అందుకుంటారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే నాగర్జున రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ తో ఒక సినిమా ప్లాన్ చేశారు.

ఒక సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని కూడా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇప్పుడు ఈ సినిమా క్యాన్సిల్ అయింది. నాగార్జునతో పాటు వారు అయిన చిరంజీవి, బాలకృష్ణ మరియు వెంకటేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం మిగతా వారితో పోలిస్తే చాలా స్లో అయిపోయారు.

చిరంజీవి ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకోగా బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు వెంకటేష్ ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించారు. అభిమానులు నాగార్జున ని కూడా మంచి ప్రాజెక్టులతో చూడాలని ఆశిస్తున్నారు. మరి నాగార్జున ఎప్పుడు ఒక హిట్ అందుకుంటారో వేచి చూడాలి. నాగార్జున ఇంకా తను తదుపరి సినిమా ని ప్రకటించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories