మలయాళం సినిమా ని రీమేక్ చేయాలని అనుకుంటున్న నాగార్జున

మలయాళం సినిమా ని రీమేక్ చేయాలని అనుకుంటున్న నాగార్జున

admin1
Updated on: 3 March 2022 7:01 PM IST
Nagarjuna Wants to Remake Malayalam Movie
X

మలయాళం సినిమా ని రీమేక్ చేయాలని అనుకుంటున్న నాగార్జున 

Nagarjuna: ఈ మధ్యకాలంలో రీమేకులు హవా టాలీవుడ్ లో బాగానే నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా సినిమా హిట్టయింది అంటే తెలుగు నిర్మాతలు మరియు హీరోలు ఆ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్", చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" మరియు "భోళా శంకర్" సినిమాలు, వెంకటేష్ నటించిన "నారపో", "దృశ్యం" సినిమాలు కూడా వేరే సినిమాలకు రీమేక్ లు గానే తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ రీమేక్ ల క్లబ్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున ఈ మధ్యనే మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయినా "బ్రో డాడీ" సినిమా ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మోహన్లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రీకొడుకులుగా మీనా మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన "బ్రో డాడీ" సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని ఇప్పుడు నాగార్జున తెలుగులో రీమేక్ చేయాలని, అఖిల్ లేదా నాగచైతన్యని ఈ సినిమాలో కొడుకు పాత్రలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో "ఘోస్ట్" సినిమాతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story