Cowin: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున

Cowin: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Arun Chilukuri
Published on: 17 March 2021 6:20 PM IST
Nagarjuna Takes The First Dose of COVID-19 Vaccination
X

Cowin: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున

Cowin: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం పేర్లను నమోదు చేయించుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. 'నిన్న నేను కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో (cowin.gov.in) రిజిస్టర్‌ చేసుకుని, టీకా వేయించుకోవాలి' అని కోరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story