బంగార్రాజు డైరెక్టర్ ను చెడామడా తిట్టిన నాగార్జున

Bangarraju: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్యనే బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా వచ్చిన ఈ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది.

admin1
Updated on: 20 Jan 2022 9:01 PM IST
Nagarjuna swears at Bangarraju for hurting the director
X

బంగార్రాజు డైరెక్టర్ ను చెడామడా తిట్టిన నాగార్జున

Bangarraju: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్యనే బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా విచ్చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా గురించి మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి నాగార్జున ఆయనను పిలిచి చెడామడా తిట్టినట్లు కళ్యాణ్ కృష్ణ చెప్పటం అందరినీ షాక్ కి గురి చేసింది.

రారండోయ్ వేడుక చూద్దాం" సినిమా చేసే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు ఒకరిద్దరు తప్పుల వల్ల సినిమా ఆలస్యమైంది. అప్పుడు వాళ్ళ తప్పులను నేను కవర్ చేశాను. నాగార్జున గారు నన్ను పిలిచి వారిని ఎందుకు కవర్ చేస్తావ్, దానివల్ల సినిమా లేట్ అవుతుంది కదా అని అన్నారు" అని చెప్పుకొచ్చిన కళ్యాణ్ కృష్ణ తన తప్పు లేకపోయినప్పటికీ వేరేవాళ్లను కాపాడే ప్రయత్నంలో తనకి తిట్లు పడ్డాయని అన్నారు. ఇక బంగార్రాజు సినిమా ను ముందు నుంచి సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నారని, అందుకే పరిస్థితులు బాలేకపోయినా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేశామని చెప్పుకొచ్చారు కళ్యాణ్ కృష్ణ.

admin1

admin1

Next Story