logo

సీనియర్ హీరోలను కదిపిన 'మజిలీ' వేదిక

సీనియర్ హీరోలను కదిపిన
Highlights

నాగార్జునకు నాగ చైతన్య మొదటి భార్య కొడుకు అని అందరికి తెలుసు కానీ చైతు తల్లి స్వయానా విక్టరీ వెంకటేష్...

నాగార్జునకు నాగ చైతన్య మొదటి భార్య కొడుకు అని అందరికి తెలుసు కానీ చైతు తల్లి స్వయానా విక్టరీ వెంకటేష్ చెల్లెలు అని కొందరికే తెలుసు. నాగార్జున మొదట వివాహం చేసుకుంది వెంకీ సోదరి దగ్గుబాటి లక్ష్మినే. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల వారు విడిపోయారు. దీని తర్వాత లక్ష్మి గారు మీడియా ముందుకు పెద్దగా వచ్చేందుకు అసలు ఇష్టపడలేదు. అప్పటినుండి వెంకీ, నాగ్ మధ్య బంధం ఎలా ఉందో అని బోలెడు పుకార్లు బయటకి వచ్చాయి. వారి మధ్య అంత బాండింగ్ లేదని జోరుగా ప్రచారం కూడా సాగింది.

వాటికి చెక్ పెట్టడం కోసమే కాబోలు మొన్న 'మజిలీ' ప్రీ రిలీజ్ వేడుకలో ఇద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా కలిసిపోయి కనిపించారు. ఇప్పటివరకు చై సినిమాలకి నాగ్ వెంకీ కలిసి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇన్నాళ్లకు 'మజిలీ' సినిమా దానికి వేదికగా మారింది. స్టేజి మీద ఇద్దరూ కలిసిపోవడం చూసి అక్కినేని మరియు దగ్గుబాటి అభిమానులు కూడా సంతోషపడ్డారు. మొత్తానికి వారి మధ్య ఎలాంటి తగాదాలు లేవని అర్థమవుతూనే ఉంది. ఇక వీరిని కలిపిన 'మజిలీ' సినిమా ఏప్రిల్ 5 న విడుదల కాబోతోంది.


లైవ్ టీవి


Share it
Top