Nagarjuna: రివ్యూ లపై నాగ్ స్పందన.. నేను కూడా..

Nagarjuna: ఈమధ్య కాలంలో సినిమా విడుదలైన మొదటి రోజున వచ్చే టాక్ ను బట్టే సినిమా కలెక్షన్లు ఆధారపడుతున్నాయి.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 7:03 PM IST
Nagarjuna Responds Over Cinema Reviews
X

Nagarjuna: రివ్యూ లపై నాగ్ స్పందన.. నేను కూడా..

Nagarjuna: ఈమధ్య కాలంలో సినిమా విడుదలైన మొదటి రోజున వచ్చే టాక్ ను బట్టే సినిమా కలెక్షన్లు ఆధారపడుతున్నాయి. చాలా వరకు ప్రేక్షకులు సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా థియేటర్లలో చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కరెక్షన్లపై సినిమా టాక్ మరియు రివ్యూస్ చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. వర్డ్ ఆఫ్ మౌత్ కి సినిమా కలెక్షన్లకి అంతగా సంబంధం కూడా ఉండేది కాదు.

తాజాగా ఇదే విషయమై మాట్లాడుతూ టాలీవుడ్ కింగ్ నాగార్జున కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు సినిమా విడుదలైన వారం తర్వాత రివ్యూస్ వచ్చేవి కానీ ప్రేక్షకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమా విడుదలైన వెంటనే రివ్యూస్ అని రియాక్షన్స్ అని, రైటింగ్స్ అని సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది.

ఆఖరికి నేను కూడా రేటింగ్ చూసే సినిమా చూడటం మొదలుపెట్టాను. ఐఎండిబి లో 7 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న సినిమాలు లేదా సిరీస్ ని మాత్రమే చూడడానికి ఇష్టపడుతున్నాను," అని చెప్పుకొచ్చారు నాగార్జున. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున తాజాగా ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో "ది గోస్ట్" సినిమాతో బిజీగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story