అక్కినేని సినిమా కోసం మెగా నిర్మాత ప్లాన్

అక్కినేని సినిమా కోసం మెగా నిర్మాత ప్లాన్
x
Highlights

హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అక్కినేని యువ హీరో అఖిల్ ఒక్క మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు సినిమాలు...

హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అక్కినేని యువ హీరో అఖిల్ ఒక్క మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు సినిమాలు అయిన 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలు డిజాస్టర్లుగా మారగా ప్రస్తుతం తన తదుపరి సినిమా పైన దృష్టి పెట్టాడు అఖిల్. ఈసారి ఎలాగైనా ఈ అక్కినేని హీరో కి హిట్ అందించి తీరాలని మెగా నిర్మాత అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. అక్కినేని అఖిల్ నాలుగవ సినిమాను అల్లు అరవింద్ స్వయంగా నిర్మించనున్నారు. ఫార్మ్ లో లేనప్పటికీ బొమ్మరిల్లు భాస్కర్ మంచి కథతో ముందుకు రావడంతో ఈ సినిమాకు దర్శకుడిగా మారాడు.

అయితే గత కొన్ని రోజులుగా అల్లు అరవింద్ ఈ సినిమా కోసం కేవలం 20 కోట్ల బడ్జెట్ ను మాత్రమే పెడుతున్నారని సినిమా బాగా రావాలంటే ఆ బడ్జెట్ సరిపోదు కాబట్టి నాగార్జున స్వయంగా కొంత బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని వార్తలు బయటకు వచ్చాయి కానీ తాజాగా అల్లు అరవింద్ ఆ పుకార్లను కొట్టిపారేశారు. ఇంతకుముందు అఖిల్ సినిమా కలెక్షన్లు బాగానే వచ్చిన కాస్ట్ ఫెయిల్యూర్ గా మారాయని అందుకే మీడియం రేంజ్ బడ్జెట్ అయితే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ప్రెజర్ ఉండదనే ఉద్దేశంతో మీడియం బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. నిజానికి అల్లు అరవింద్ మీద ఉన్న నమ్మకంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్టు విషయంలో తలదూర్చటం లేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories