Nagarjuna - Samantha: సమంత కి షాక్ ఇచ్చిన నాగార్జున

* సమంత ట్వీట్ కి రిప్లై ఇవ్వని నాగార్జున

admin1
Updated on: 3 Sept 2021 4:09 PM IST
Nagarjuna not Given Reply to Samantha Akkineni post About his Birthday Wishes in Twitter
X

సమంత - నాగార్జున (ఫైల్ ఫోటో)

Samantha Akkineni: ఎప్పుడైతే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ మరియు ట్విట్టర్ఎప్పుడైతే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ మరియు ట్విట్టర్ ఎకౌంట్ లలో తన పేరును సమంత అక్కినేని నుంచి ఎస్ గా మార్చుకున్నప్పటి నుంచి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలపై అటు అక్కినేని హీరోలు ఇటు సమంత మౌనం వహించడం తో పుకార్లు మరింత పెరిగాయి. సమంత అసలు ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి లేదని వారు త్వరలోనే తమ విడాకులను ప్రకటించనున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే ఈ మధ్యనే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కూడా "హ్యాపీ బర్త్డే నాగార్జున మామ" అంటూ శామ్ ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ ఇప్పుడు నాగార్జున వైఖరి చూస్తే చై, శామ్ నిజంగానే విడిపోతున్నారు అని అభిమానులు భయపడుతున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున కూడా చిరంజీవి, రమ్యకృష్ణ, నాగ చైతన్య, తదితరులు చేసిన ట్వీట్స్ కి కృతజ్ఞతలు చెప్తూ రిప్లై ఇచ్చారు. కానీ సమంత ట్వీట్ కు మాత్రం నాగార్జున రిప్లై ఇవ్వకపోవడం తో విడాకుల వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. మరి ఈ పుకార్లపై ఎవరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారా అని అక్కినేని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

admin1

admin1

Next Story