అల్లరి నరేష్ తో నాగార్జున మల్టీస్టారర్ సినిమా

* అలాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్న నాగార్జున

Dhatripriya
Updated on: 29 Dec 2022 9:00 PM IST
Nagarjuna Multistarrer Movie with Allari Naresh
X

అల్లరి నరేష్ తో నాగార్జున మల్టీస్టారర్ సినిమా

MultiStarrer Movie: సినీ హీరో అక్కినేని నాగార్జున కరియర్ లో ఎన్నో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో నటించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ లను కూడా అందుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో నాగార్జున ప్రయత్నిస్తున్న అన్ని యాక్షన్ థ్రిల్లర్ లు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారుతున్నాయి. "బంగార్రాజు" వంటి మాస్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అందుకే నాగార్జున ఇప్పుడు మాస్ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "గాడ్ ఫాదర్" సినిమా సమయంలో ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా తో నాగార్జున ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ "గాడ్ ఫాదర్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోవడంతో నాగార్జున సినిమాని క్యాన్సిల్ చేసుకున్నారు. రవితేజ "ధమాకా" సినిమా హిట్ అయితే రైటర్ ప్రసన్నకుమార్ తో కూడా నాగార్జున ఒక సినిమాని ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా ఈ మధ్యనే విడుదల ఈ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ప్రసన్నకుమార్ తో చేతులు కలపడానికి నాగార్జున కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో మరొక హీరో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది నాగార్జున మరియు అల్లరి నరేష్ కలిసి చేయబోతున్న మల్టీస్టారర్ సినిమా అని కమర్షియల్ కామెడీతో నిండి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు అల్లరి నరేష్ కూడా డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. మరి ఈ సినిమా ఈ ఇద్దరు హీరోలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story