ఓటీటీలో అడుగుపెట్టనున్న టాలీవుడ్ కింగ్

Nagarjuna is all set to Make his OTT Debut
x

ఓటీటీలో అడుగుపెట్టనున్న టాలీవుడ్ కింగ్ 

Highlights

Nagarjuna: ఈ మధ్యకాలంలో థియేటర్ల కి వెళ్లి సినిమాలు చూసే కంటే ఇంట్లోనే ఉండి మొబైల్ ఫోన్ లో ఓటీటీలో ఉండే సినిమాలు చూసే జనాలు కూడా ఎక్కువగా ఎక్కువ అయ్యారు.

Nagarjuna: ఈ మధ్యకాలంలో థియేటర్ల కి వెళ్లి సినిమాలు చూసే కంటే ఇంట్లోనే ఉండి మొబైల్ ఫోన్ లో ఓటీటీలో ఉండే సినిమాలు చూసే జనాలు కూడా ఎక్కువగా ఎక్కువ అయ్యారు. ఓటీటీలో ప్లాట్ఫామ్స్ కి పెరుగుతున్న క్రేజ్ చూసి స్టార్ సెలబ్రెటీలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రెటీలు షో ల ద్వారానో వెబ్ సిరీస్ ల ద్వారానో ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టారు. ఈ జాబితాలో త్వరలో తన పేరు కూడా నమోదు చేయనున్న సీనియర్ హీరో నాగార్జున. అయితే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఓటీటీలో కోసం ఏమీ నిర్మించడం లేదు కానీ తానే హీరోగా ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నారు.

త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవబోతున్న ఒక వెబ్ సిరీస్ లో నాగార్జున హీరోగా నటిస్తున్నారు. ఒక కొత్త డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అని సమాచారం. న్యూ ఏజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 కూడా ఓటీటీలలోనే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున షో హోస్ట్‌గా కూడా పోటీలలో కనిపించనున్నారు. ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున ఈ వెబ్ సిరీస్ తో ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories