Nagarjuna: నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున

Nagarjuna: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 5:23 PM IST
Actor Nagarjuna approached the Nampally court
X

Nagarjuna: నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ఘటన కీలక మలుపు తీసుకుంది. మంత్రి వ్యాఖ్యలపై నటులు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని నాగార్జున తనయుడు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తన వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారు. సమంతకు సారీ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story