అలాంటి సినిమాలకి దూరంగా ఉండమని మొత్తుకుంటున్న నాగార్జున అభిమానులు

Nagarjuna Fans Request to do Commercial Movies
x

అలాంటి సినిమాలకి దూరంగా ఉండమని మొత్తుకుంటున్న నాగార్జున అభిమానులు

Highlights

Nagarjuna: కమర్షియల్ సినిమాల చేయమని నాగార్జున అభిమానుల రిక్వెస్ట్

Nagarjuna: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు "ది ఘోస్ట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. నిజానికి ఇది ఒక ఎక్స్పరిమెంటల్ సినిమా అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ సినిమాలలోని చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నది ఉన్నట్టుగా ఇందులో కాపీ చేశారు అంటూ అభిమానులు సైతం ఈ సినిమాపై మండిపడుతున్నారు. గత కొంతకాలంగా నాగర్జున ఇలాంటి ఎక్స్పరిమెంటల్ సినిమాలే చేస్తున్నారు కానీ అందులో ఒకటి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించ లేకపోయింది.

"ది ఘోస్ట్" సినిమా కూడా ట్రైలర్ తో బాగానే మెప్పించి మంచి అంచనాల మధ్య విడుదలైంది. కానీ అది కూడా చాలా వరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిమానులు సైతం కొంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇకనైనా నాగార్జున ఇలాంటి ఎక్స్పరిమెంటల్ సినిమాలకు దూరంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. కొత్త డైరెక్టర్లతో నైనా పర్లేదు కానీ మంచి కమర్షియల్ సినిమాలు చేస్తే బాగుంటుందని అంటే తప్ప ఎంత టాలెంట్ ఉన్నా డైరెక్టర్లతోనైనా ఇలాంటి ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడం ఇకనైనా మానుకుంటే మేలని అభిమానులు నాగార్జునను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా నాగార్జున అభిమానుల మాట విని కమర్షియల్ సినిమాల వైపు చూస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories