Nagarjuna Akkineni: సెంచరీకి చేరువలో అక్కినేని నాగార్జున

Nagarjuna Akkineni: యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున త్వరలోనే సెంచరీ చేయబోతున్నాడు.

Venkata Chari
Published on: 1 April 2021 6:05 PM IST
Nagarjuna confirms films with Vaishnav Tej, Praveen Sattaru & Kalyan
X

నాగార్జున, వైష్ణవ్ తేజ్ (ఫొటో హన్స్ ఇండియా)

Nagarjuna Akkineni: యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున త్వరలోనే సెంచరీ చేయబోతున్నాడు. అదేనండి తన కెరీర్ లో 100 వ సినిమాను చేరుకోబోతున్నాడు. ఇప్పటి వరకు 96 సినిమాల్లో హీరోగా నటించిన నాగార్జున.. ప్రస్తుతం తన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరో రెండు చిత్రాలను కూడా లైన్ లో పెట్టాడు. వైల్డ్ డాగ్ ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన నాగార్జున.. ప్రవీణ సత్తారు, కళ్యాణ్ కృష్ణలతో కలిసి సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నారా అని అడిగినప్పుడు, "అవును. నేను వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే సినిమా కోసం కొత్త దర్శకుడిని కూడా ఖరారు చేశాము. వైష్ణవ్ కూడా స్క్రిప్ట్ బాగా నచ్చింది. అధికారికంగా త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడిస్తాం" అని అన్నారు.

అలాగే, ప్రవీణ్ సత్తారు తో చేయనున్న సినిమాకు షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు నాగార్జున వెల్లడించారు. "బంగార్రాజు స్క్రిప్ట్ త్వరలో పూర్తవుతోంది. అలాగే కొన్ని వెబ్-సిరీస్ ప్రాజెక్టులతో కూడా చర్చలు చేస్తున్నాం" అని వెల్లడించారు.

కాగా, వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న తెరపైకి వస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story