Nagarjuna: "పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్ తర్వాత కార్తీనే" అంటున్నా నాగార్జున

Nagarjuna: "పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్ తర్వాత కార్తీనే" అంటున్నా నాగార్జున

Rama Rao
Published on: 20 Oct 2022 5:34 PM IST
Nagarjuna Compares Karthi with Pawan Kalyan and Puneeth Rajkumar
X

Nagarjuna: "పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్ తర్వాత కార్తీనే" అంటున్నా నాగార్జున 

Nagarjuna: విశాల్ హీరోగా నటించిన "అభిమన్యుడు" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోలీవుడ్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ తాజాగా ఇప్పుడు కార్తీ హీరోగా "సర్దార్" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. రాశి కన్నా, రజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ్ లో మాత్రమే కాక తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ వారు స్వయంగా ఈ సినిమాని తెలుగులో సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఇక ఈ వేడుకలో మాట్లాడుతూ, "కార్తీ అన్న సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ నీడ నుంచి బయటకు వచ్చి ప్రూవ్ చేసుకోవటం చాలా కష్టం. అలాంటి వాళ్ళని ముగ్గురిని మాత్రమే చూశాను. మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్, కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.

ఇప్పుడు తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీ. స్టార్ డం సంపాదించటం అంత సులువైన విషయం కాదు. తన సినిమాలతో కార్తీ కూడా సూర్య అంత స్టార్ అయ్యారు. కార్తీ తో ఊపిరి అనే సినిమా చేశాను. అప్పటినుంచి మా అనుబంధం మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సర్దార్ సినిమాని సమర్పించడం చాలా గర్వంగా ఉంది" అని అన్నారు నాగార్జున.

Rama Rao

Rama Rao

Next Story